Vaartha

Vaartha

Vaartha - The National Telugu Daily is among the select few bold and accountable newspapers in India.

National
English, Telugu
Newspaper

Outlet metrics

Domain Authority
26
Ranking

Global

#253282

India

#18649

News and Media

#511

Traffic sources
Monthly visitors

Articles

  • Oct 5, 2024 | vaartha.com | Suma Latha

    హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జి.వెంకటస్వామి (కాకా) 95వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన అతి కొద్దిమందిలో కాకా ఒకరు అని, గతంలో ఉన్నవారు కాకాను కాంగ్రెస్ పార్టీ కోణంలో చూశారో..లేక ఆయన్ను ప్రజల నుంచి దూరం చేయాలనుకున్నారో తెలియదన్నారు. కాకా జయంతిని ప్రభుత్వం అధికారికంగా చేయాలని నేను అధికారులను ఆదేశించా అని, ఆనాడు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మరుగున పడకూడదని కాకా సోనియమ్మను ఒప్పించారన్నారు.

  • Oct 5, 2024 | vaartha.com | Suma Latha

    తిరుమల: గత ఐదేళ్లుగా అమలవుతున్న రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని రద్దు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈఓ శ్యామలరావు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్య‌మంత్రి చంద్రబాబు తిరుమల పర్యటన ముగిసిన వెంటనే ఈ ఉత్తర్వులు వెలువ‌డ‌టం గమనార్హం. ఇక వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీఎం చంద్రబాబు సతీసమేతంగా తిరుమలకు వెళ్లి స్వామివారిని ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా టీటీడీ అధికారులతో పద్మావతి అతిథి గృహంలో శనివారం ఉదయం ఆయ‌న‌ సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు.

  • Oct 5, 2024 | vaartha.com | Suma Latha

    వాషింగ్టన్: ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ ప్రత్యక్ష దాడితో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. ఇరు దేశాలు పరస్పరం మిస్సైళ్లు, బాంబుల వర్షం కురిపించుకుంటున్నాయి. దీంతో పశ్చిమాసియాపై యుద్ధ మేఘాలు అలముకున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌ అణుస్థావరాలను ఇజ్రాయెల్‌ ధ్వంసం చేస్తుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. నార్త్‌ కరోలినాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ట్రంప్‌ మాట్లాడుతూ..

  • Oct 5, 2024 | vaartha.com | Suma Latha

    న్యూఢిల్లీ: పరువు నష్టం కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ కి పూణె ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. గతేడాది లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో స్వాతంత్య్ర సమరయోధుడు వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ పై రాహుల్‌ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సావర్కర్‌ మనవడు సత్యకి సావర్కర్‌ పూణె కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ప్రతి సందర్భంలోనూ సావర్కర్‌ను అవమాన పరిచేలా రాహుల్‌ విమర్శలు చేస్తున్నారని సత్యకి ఆరోపించారు.

  • Oct 5, 2024 | vaartha.com | Suma Latha

    హైదరాబాద్‌: టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో విషాదం.. ఆయన కుమార్తె గాయత్రి గుండెపోటుతో కన్నుమూశారు. శుక్రవారం గుండెపోటు రావడంతో వెంటనే హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.. అక్కడ చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. కుమార్తె మరణంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. పలువురు సినీ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్‌ను పరామర్శించారు. రాజేంద్రప్రసాద్‌కు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆమె మృతికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రిది ప్రేమ వివాహం..