-
Sep 24, 2023 |
tv9telugu.com | Anil kumar poka
-
Sep 24, 2023 |
tv9telugu.com | Anil kumar poka
ఉగ్రవాదులతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న ఓ డీఎస్పీని జమ్మూకశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాదులను కాపాడేందుకు డీఎస్పీ ఏకంగా పోలీసులపై తప్పుడు ఫిర్యాదులు సృష్టించాడని తేలింది. ఇక, ట్విటర్లోనూ ఇతడో సెలబ్రిటి.. ఏకంగా 44వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. . జమ్మూకశ్మీర్ పోలీసు శాఖలో డీఎస్పీగా పనిచేస్తున్న షేక్ ఆదిల్ ముస్తాక్.. ఉగ్ర ఆపరేటీవ్‌లకు సహకరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాదు.. అతడిపై దర్యాప్తు చేస్తున్న అధికారిని దీనిలో ఇరికించాలని యత్నించాడు.
-
Sep 24, 2023 |
tv9telugu.com | Anil kumar poka
చంద్రుడిపై స్లీప్ మోడ్‌లో ఉన్న చంద్రయాన్-3 కు సంబంధించిన విక్రమ్ ల్యాండర్, రోవర్ ప్రజ్ఞాన్‌ను పునరుద్ధరించే ప్రణాళికలను శనివారానికి వాయిదా వేసినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తెలిపింది. తొలుత శుక్రవారం సాయంత్రం ల్యాండర్, రోవర్‌ను తిరిగి యాక్టివేట్ చేయాలని భావించినట్లు స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ దేశాయ్ తెలిపారు. అయితే కొన్ని కారణాల వల్ల దీనిని సెప్టెంబర్ 23న చేపడతామని చెప్పారు.
-
Sep 24, 2023 |
tv9telugu.com | Anil kumar poka
తరాలు మారుతున్న తలరాతలు మారడం లేదు. ఏళ్లు గడుస్తున్నాయి.. టెక్నాలజీ పెరుగుతోంది.. సాటిలైట్ టౌన్‌షిప్‌లు అభివృద్ధి చెందుతున్నాయి.. అంతరిక్షంలో అద్భుతాలు సృష్టిస్తున్నాం.. ఆఖరికి చంద్రుడిపై కాలు కూడా మోపాం. కానీ ఆ అడవి బిడ్డల జీవితాలు మాత్రం మారడం లేదు. టెక్నాలజీ మాట దేవుడెరుగు.. కనీస మౌలిక సదుపాయాలు లేక నరకయాతన అనుభవిస్తున్నారు. చినుకు పడితే చాలు.. గిరిపుత్రులకు దిక్కుతోచని స్థితి. అత్యవసర వైద్య సేవలకైనా.. మృతదేహాన్ని తరలించడానికైనా.. రోడ్లు లేక వారి అవస్థలు వర్ణనాతీతం.
-
Sep 24, 2023 |
tv9telugu.com | Anil kumar poka
హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు నగరం అస్తవ్యస్తంగా మారింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వృక్షాలు నేలకూలుతున్నాయి. వర్షాలకు నానిపోయిన ఇళ్ల గోడలు కుప్పకూలుతున్నాయి. అనేకమంది ప్రమాదాలబారిన పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని అసెంబ్లీ క్యాంటీన్ ప్రాంగణంలో ఓ భారీ వృక్షం నేలకూలింది. చెట్టుకింద నిల్చున్న వ్యక్తులు అప్రమత్తమై పరుగులు తీశారు. చెట్టుకింద పార్క్ చేసిన రెండు ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి.
-
Sep 24, 2023 |
tv9telugu.com | Anil kumar poka
బెంగాళీలకు గుడ్ న్యూస్ చెప్పింది బంగ్లాదేశ్. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా భారత్‌కు పద్మా పులస ఎగుమతికి బంగ్లాదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. దసరా పండుగ సీజన్‌కు ముందుగా దాదాపు 3,950 మిలియన్ టన్నుల పద్మా పులసలను భారత్‌కు ఎగుమతి చేస్తున్నట్లు ప్రకటించింది. బంగ్లాదేశ్ నుంచి వచ్చే ఈ పద్మా పులసను బెంగాలీలు చాలా ప్రత్యేకం. బెంగాల్లో దేవీ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. దసరా పండుగ సీజన్లో బెంగాళీలు పద్మా పులస చేపలను ఎంతో ప్రత్యేకంగా వండుకుని ఆరగిస్తారు.
-
Sep 24, 2023 |
tv9telugu.com | Anil kumar poka
అదేంటి? పాముకి కదా రెండు నాలుకలు ఉండేది.. మనిషికి ఎలా సాధ్యం? అనుకుంటున్నారా? టెక్నాలజీ యుగంలో అసాధ్యం అనుకున్నవెన్నో సుసాధ్యం చేసేస్తున్నారు. మనిషి తనను తాను కొన్ని సందర్భాలనుంచి తప్పించుకోడానికి ఎటు వీలైతే అటు మాట్లాడుతుంటాడు. అలాంటి వారికి రెండు నాలుకలు ఉన్నాయని కామెంట్ చేయడం వింటూ ఉంటాం. కానీ ఇక్కడ ఓ మహిళకు నిజంగానే రెండు నాలుకలు ఉన్నాయి. ఆమె తన రెండు నాలుకలను చూపిస్తూ ఓ వీడియోను తన సోషల్ మీడియా ఖాతా టిక్‌టాక్‌లో పోస్ట్ చేసింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఇదెలా సాధ్యం అని ఆశ్చర్యపోతున్నారు.
-
Sep 24, 2023 |
tv9telugu.com | Anil kumar poka
కామాంధులు మృగాళ్ళుగా రెచ్చిపోయారు. తమ కుటుంబసభ్యుల కళ్లెదుటే ముగ్గురు మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వారి ఇంట్లోని నగదు, నగలతో పారిపోయారు. ఈ దారుణ ఘటన హర్యానాలో వెలుగుచూసింది. సంచలనం రేపుతోన్న ఈ ఘటన పానిపట్‌లో ప్రాంతంలో సెప్టెంబర్ 21 రాత్రి జరిగింది. మట్లౌడా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. అర్ధరాత్రి సమయంలో కత్తులు, పదునైన ఆయుధాలతో ఇంటిలోకి చొరబడ్డారు దుండగులు. కుటుంబసభ్యులను తాళ్లతో బంధించారు.
-
Sep 24, 2023 |
tv9telugu.com | Anil kumar poka
ఏనుగులు నీటిలో, బురద గుంటల్లో ఆడుకోవడం అంటే చాలా ఇష్టపడతాయి. నీళ్లను తొండంతో ఒంటిపై చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తాయి. బురద గుంటల్లో కూడా ఆడుతూ ఉంటాయి. అలా ఓ గున్న ఏనుగు బురద గుంట కనిపించగానే పరుగున వెళ్లి అందులో దిగింది. పాపం అది లోతుగా ఉండటంతో బయటకు రాలేకపోయింది. అడుగు కదిపే పరిస్థితి లేకపోవడంతో బయటకు రావడానికి ప్రయత్నించి ప్రయత్నించి నీరసించిపోయి నిస్సహాయంగా పడిపోయింది. చుట్టుపక్కల ఎలాంటి జంతువుల జాడా లేదు. ఆ గున్న ఏనుగు అక్కడికి ఒంటరిగా వచ్చిందో ఏమో ఆ సమీపంలో ఇతర ఏనుగులు కూడా ఏమీ కనిపించలేదు.
-
Sep 24, 2023 |
tv9telugu.com | Anil kumar poka
సాధారణంగా పాములంటే అందరికీ భయమే. ఇక కొండచిలువ పేరు వింటే.. అమాంతం మింగేస్తుందని ఆమడదూరం పరుగెడతారు. కానీ ఇక్కడ ఓ వ్యక్తి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు కొండచిలువలను తాళ్లను పట్టుకున్నట్టు పట్టుకుని తీసుకెళ్తున్నాడు. ఈ కొండ చిలువలు ఎక్కడో పట్టుబడ్డవి కూడా కాదు, విశాఖ నగరం నడిబొడ్డున పట్టుకున్నవే. ఇవన్నీ ఇటీవల నెల లోపు పట్టుబడ్డవే. ఒక ఇంట్లో కోడి పిల్లలు ఉన్న గంప కింద దూరి వాటిని తింటూ పట్టుబడ్డ కొండ చిలువ ఒకటైతే, చేపల వలలో ఒకటి, ఇంకోటి కొండ దిగువన ఉన్న ఇళ్లలోకి దూరిన పాము.