Articles

  • 2 weeks ago | prabhanews.com | Gopi Krishna

    వెల‌గ‌పూడి – రాష్ట్రంలో సంక్షేమం-అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా సొంతంగా ఆదాయ మార్గాలు పెంచుకోవలన్నారు ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పన్నుల వసూళ్లు పెరిగేలా ఆదాయార్జన శాఖలన్నీ పనిచేయాలని అధికారులను ఆదేశించారు. మరిన్ని ఆదాయ మార్గాలను వెతకడంతో పాటు, ఎక్కడ ఆదాయం తక్కువుగా నమోదవుతుందో దానికి గల కారణాలను వెతికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. పన్నుల చెల్లింపుల దగ్గర నుంచి రశీదులు, నోటీసులు జారీ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లో జరగాలని చెప్పారు.

  • 2 weeks ago | prabhanews.com | Gopi Krishna

    అహ్మదాబాద్ – తెలంగాణలో 90 శాతం జనాభా ఓబీసీలు, దళితులు, మైనార్టీలు ఉన్నారని, కానీ రాష్ట్ర సంపద మాత్రం కార్పొరేట్ వర్గాల దగ్గరే ఉందని అన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత రాహుల్ గాంధీ.. 24 గంటలు ఓబీసీలు, ఆదివాసీల గురించి మాట్లాడే నరేంద్ర మోడీ ఆ వర్గాలకు మాత్రం మేలు చేయరని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌ను బీజేపీ రద్దు చేసిందని ధ్వజమెత్తారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఎఐసిసి సమావేశంలో నేడు రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ,.

  • 2 weeks ago | prabhanews.com | Gopi Krishna

    హైద‌రాబాద్ – రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రత్యేకించి జయశంకర్ భూపాలపల్లి, ములుగు, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున ఆ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

  • 2 weeks ago | prabhanews.com | Gopi Krishna

    హైద‌రాబాద్ – తెలంగాణ‌లో బిజెపిని అడుగుపెట్ట‌నిచ్చేది లేద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై బిజెపి ఎంపి ర‌ఘ‌నంద‌న్ స్పందించారు. ఇప్ప‌టికే తాము తెలంగాణలో అడుగుపెట్టామ‌ని, ఇక మిగిలింది త‌మ‌ర్ని సాగ‌నంప‌డ‌మేన‌ని అన్నారు.. హైద‌రాబాద్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, ఇప్ప‌టికే ఎనిమిది ఎంపి స్థానాల‌లో,ఎనిమిది అసెంబ్లీ స్థానాల‌లో పాగా వేశామ‌న్నారు..

  • 2 weeks ago | prabhanews.com | Gopi Krishna

    అహ్మ‌దాబాద్ – కులాలు, మతాల మధ్య ప్రధాని మోడీ చిచ్చుపెడుతున్నారని , దేశాన్ని విభజించాలని క‌మ‌ల‌నాధులు చూస్తున్నారని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు… దేశమంతా కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కులగణన చేసి రాహుల్‌ గాంధీ కి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే రైతులకు రుణమాఫీ చేసినట్లు చెప్పారు. మోడీ, బీజేపీ నేతలు గాడ్సే సిద్ధాంతాన్ని ప్రోత్సహిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Contact details

Socials & Sites

Try JournoFinder For Free

Search and contact over 1M+ journalist profiles, browse 100M+ articles, and unlock powerful PR tools.

Start Your 7-Day Free Trial →