
Articles
-
Sep 27, 2023 |
tv9telugu.com | Ram Naramaneni
యువమంత్రిగా కేబినెట్‌లో ఆయనకో గుర్తింపు ఉంది. పార్టీ గొంతుని బలంగా వినిపించే స్పోక్స్‌పర్సన్స్‌లో ముందుంటారు ఉత్తరాంధ్ర మినిస్టర్. అధిష్ఠానం దగ్గర మంచి మార్కులు కొట్టేసిన గుడివాడ అమర్‌నాథ్.. 2024లో మళ్లీ అనకాపల్లి అసెంబ్లీ సీటు నుంచి పోటీచేయరన్న బలమైన ప్రచారం జరుగుతోంది. సాధారణంగా ఎమ్మెల్యేలెవరూ అంత తొందరగా నియోజకవర్గం మారరు. పైగా మంత్రి హోదా కూడా ఉండటంతో నియోజకవర్గాన్ని కంచుకోటగా మలుచుకుని అక్కడినుంచే రాజకీయం చేస్తారు.
-
Sep 27, 2023 |
tv9telugu.com | Ram Naramaneni
అమరావతి సీడ్ క్యాపిటల్ చుట్టూ రింగ్ రోడ్ నిర్మాణం గత ప్రభుత్వ సంకల్పం. అయితే అధికారులు రచించిన 94కిలోమీటర్ల మాస్టర్ ప్లాన్, 97.50కిలోమీటర్లకు ఎందుకు పెరిగింది? ముందుగా గీసిన రూట్ మ్యాప్ కాదని.. వేరే ఊళ్ల గుండా ఎందుకు కొత్త రూట్ ప్రతిపాదించాల్సి వచ్చింది? టెండర్లు పిలవకుండా, ప్రక్రియ పాటించకుండా కన్సల్టేషన్లు, కాంట్రాక్ట్‌లు ఎలా ఇచ్చారు? రోడ్డు మ్యాప్‌కి ముందే కొనుగోళ్లు, ఆ తర్వాత మాస్టర్ ప్లాన్ అమలుతో ఎవరు, ఎంత మేర లాభపడ్డారు? వీటిని శోధించి సాధించి సీఐడీ కొన్ని అభియోగాలు కోర్టులో ఉంచింది.
-
Sep 27, 2023 |
tv9telugu.com | Ram Naramaneni
భాగ్యనగరాన్ని మళ్లీ వరణుడు పలకరించాడు. ముఖ్యంగా జంట నగరాల్లో వరణుడు ఈదురుగాలులతో కూడిన వర్షంతో తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. బుధవారం ఆకాశం మేఘావృతమై పలుచోట్ల సాయంత్రం నుండి కుండపోత వర్షం కురుస్తోంది. నిరంతరాయంగా కురుస్తున్న వర్షంతో నగరం తడిసి ముద్దైంది. మరో మూడు రోజులు ఇదే పరిస్థితి ఉండటంతో వాతావరణశాఖ హైదరాబాద్ లో ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం…. హైదరాబాద్ లో నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. ఆఫీసుల నుంచి ఇంటికిపోయే సమయంలో ఒక్కసారిగా కుండపోత వాన కురిసింది.
-
Sep 27, 2023 |
tv9telugu.com | Ram Naramaneni
బిగ్ బాస్ గేమ్ షో సీజన్ 7 ఉల్టా పుల్టా ట్విస్టులతో దూసుకుపోతుంది. ఎప్పుడు లేని ట్విస్టులతో హొరెత్తిస్తున్నాడు బిగ్ బాస్. దీంతో ఊహించని మలుపులు చోటుచేసుకుంటున్నాయి. వీక్షకుల మైండ్ సెట్స్ కూడా ఒక్క రోజులోనే మారిపోతున్నాయి. ఈ వారం యావర్, గౌతమ్, ప్రియాంక, టేస్టీ తేజ, రతిక, శుభ శ్రీ నామినేషన్‌లో ఉన్నారు. అయితే అనధికార ఫలితాల్లో మైండ్ బ్లోయింగ్ రిపోర్టులు వస్తున్నాయి. ప్రస్తుతానికి పలు పోల్స్‌లో ప్రిన్స్ యావర్ టాప్ ప్లేసులో ఉన్నాడు. ఆ తర్వాత ప్లేసులోకి అనూహ్యంగా గౌతమ్ దూసుకువచ్చాడు. గౌతమ్..
-
Sep 27, 2023 |
tv9telugu.com | Ram Naramaneni
మల్కాజ్‌గిరి చుట్టే తిరుగుతోంది తెలంగాణ రాజకీయం. గ్రేటర్‌సిటీపరిధిలోని ఈ నియోజకవర్గం అధికారపార్టీకి ఇప్పుడు ప్రిస్టేజియస్‌గా మారింది. పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు టికెట్ ప్రకటించాక తిరుగుబాటు చేయటంతో మల్కాజ్‌గిరిపై గట్టిగా గురిపెట్టింది బీఆర్‌ఎస్. తన కొడుక్కి మెదక్ సీటు ఇవ్వకపోవటంతో ఆగ్రహించిన మైనంపల్లి గులాబీపార్టీకి గుడ్‌బై చెప్పారు. కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
Try JournoFinder For Free
Search and contact over 1M+ journalist profiles, browse 100M+ articles, and unlock powerful PR tools.
Start Your 7-Day Free Trial →