Ravi U. Krishna's profile photo

Ravi U. Krishna

Articles

  • Feb 13, 2025 | ruralindiaonline.org | kavitha Muralidharan |P. Sainath |Ravi U. Krishna

    "ప్రతి సంవత్సరం బడ్జెట్‌పై జరిగేఈ హంగామా మా జీవితాలను కొద్దిగానైనా మారుస్తుందా?" అని ఇద్దరు పిల్లల ఒంటరి తల్లికె. నాగమ్మ అడిగారు. ఆమె భర్త 2007లో సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేస్తూ మరణించారు. ఈ విషాదం ఆమెను సఫాయి కర్మచారి ఆందోళన్‌ వారి చెంతకు చేర్చగా, ఇప్పుడామె దాని కన్వీనర్‌గాపనిచేస్తున్నారు. ఆమె పెద్ద కుమార్తె శైల నర్సు గాను, చిన్న కూతురు ఆనంది తాత్కాలికప్రభుత్వ ఉద్యోగంలోనూ ఉన్నారు. “మాకు ‘బడ్జెట్’అనేది కేవలం ఒక అలంకార పదం మాత్రమే.

  • Feb 11, 2025 | ruralindiaonline.org | Amir Malik |Swadesha Sharma |Ravi U. Krishna

    కోవిడ్ -19 మహామారి సమయంలో కాలి నడకనహరియాణా నుంచి ఉత్తరప్రదేశ్‌లోని తన స్వస్థలమైన మహారాజ్‌గంజ్‌కి ఎలా ప్రయాణించాల్సివచ్చిందో సునీతా నిషాద్ గుర్తు చేసుకున్నారు. హఠాత్తుగా దేశవ్యాప్తలాక్‌డౌన్ ప్రకటించటంతో ఎన్నో అవస్థలు పడి తమ స్వస్థలాలకు తిరిగి వెళ్ళాల్సివచ్చినలక్షలాదిమంది వలస కార్మికులలో ఆమె కూడా ఒకరు. అందువల్ల కేంద్ర బడ్జెట్‌లోనైనా, లేదామరెక్కడైనా ప్రకటించే ఎలాంటి నూతన ప్రభుత్వ పథకాలపైన కూడా ఆమె ఆసక్తి చూపకపోవడంలో అంతఆశ్చర్యపడాల్సిందేమీ లేదు.

  • Oct 8, 2024 | ruralindiaonline.org | Ashwini Shukla |Ravi U. Krishna

    “కొంచెం కోపాన్ని చూపించడానికి కళ్ళనుకొద్దిగా పైకి లేపాలి... తీవ్రమైన కోపం చూపించేందుకు, కళ్ళు పెద్దగా చేసి, కనుబొమ్మలుపైకి లేపి ఉంచాలి. ఆనందం చూపించటం కోసం, చిరునవ్వుతో బుగ్గలను పొంగించాలి.’’ఇలాంటి చిన్న చిన్న వివరాలపై శ్రద్ధ చూపడమే దిలీప్ పట్నాయక్‌ను ఝార్ఖండ్‌లోనిసరాయకేలా ఛావ్ నృత్యంలో ఉపయోగించే ముఖాలకు తగిలించుకునే ముసుగులను తయారుచేయడంలో ప్రముఖకళాకారుడిగా మార్చింది. "మారుముఖం అనేది పాత్రను ప్రతిబింబించాలి," అంటారుఆయన. "సరాయకేలా మారుముఖాలు ప్రత్యేకమైనవి.

  • Jul 12, 2024 | ruralindiaonline.org | sanket jain |Dipanjali Singh |Ravi U. Krishna

    కారదగ గ్రామంలోఎవరికైనా బిడ్డ పుడితే, కుటుంబీకులు ముందుగా సోమక్క పూజారికి తెలియజేస్తారు. దాదాపు9,000 మంది జనాభా ఉన్న ఆ గ్రామంలో, ఇప్పటికీ గొర్రె వెంట్రుకలతో గాజులు తయారుచేసే అతికొద్దిమందికళాకారులలో ఆమె ఒకరు. స్థానికంగాకండఅనిపిలిచే ఈ ఆభరణాలను శుభప్రదంగా పరిగణిస్తారు, వాటిని నవజాత శిశువుల మణికట్టు చుట్టూకడతారు. "గొర్రెలుతరచుగా కఠినమైన వాతావరణంలో, పచ్చిక బయళ్ళను వెతుక్కుంటూ గ్రామాలన్నీ తిరుగుతాయి, రకరకాలప్రజలతో కలుస్తాయి" అని మలి 50ల వయసులో ఉన్న సోమక్క చెప్పారు.

  • Jul 2, 2024 | ruralindiaonline.org | Akanksha Kumar |Priti David |Sarbajaya Bhattacharya |Ravi U. Krishna

    తూఫానీ, ఆయన నేతకారుల బృందం ఉదయం 6:30 నుంచి పని చేస్తున్నారు. రోజుకు 12అంగుళాల నేత నేస్తూ, ఆ నలుగురు కలిసి పనిచేస్తే, 23x6 అడుగులగలీచా(కార్పెట్)ను పూర్తి చేయడానికి వారికి 40 రోజులు పడుతుంది. మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు, తూఫానీ బింద్ చివరకు ఒక చెక్క బల్లపై విశ్రాంతితీసుకోవడానికి కూర్చున్నారు. ఆయన పని చేస్తున్న రేకుల షెడ్‌లో, ఆయనకు వెనుకవైపున్నచెక్క చట్రానికి తెల్లటి నూలు దారాలు వేలాడుతున్నాయి. ఆయన ఈ కార్యశాల ఉత్తరప్రదేశ్‌లోనిపుర్‌జాగీర్ ముజేహరా గ్రామంలో ఉంది.

Contact details

Socials & Sites

Try JournoFinder For Free

Search and contact over 1M+ journalist profiles, browse 100M+ articles, and unlock powerful PR tools.

Start Your 7-Day Free Trial →