
Y. Krishna Jyothi
Articles
-
Jan 11, 2025 |
ruralindiaonline.org | Priti David |Sarbajaya Bhattacharya |Y. Krishna Jyothi
“ మిర్చి , లసూన్ (వెల్లుల్లి), అద్రక్ (అల్లం)... సొర, కరేలా (కాకర) ఆకులు,... బెల్లం.” ఈ మిరపకాయలు, వెల్లుల్లి, అల్లం, కాకరకాయలు ఏదో వంటకంతయారీ కోసమైతే కాదు… పన్నా టైగర్ రిజర్వ్‌ను ఆనుకొని ఉన్న చున్గునా గ్రామంలో, శక్తివంతమైనఎరువుల, క్రిమిసంహారక మందుల తయారీ కోసం సేంద్రియ రైతయిన గులాబ్‌రాణి ఉపయోగించే పదార్థాలుఇవి. సదరు జాబితా విన్న మొదట్లో తను బిగ్గరగా నవ్వాననిఈ 53 ఏళ్ళ మహిళ గుర్తు చేసుకున్నారు. “ఇవన్నీ నేను ఎక్కడ సంపాదించాలి అనుకున్నాను.
-
Dec 17, 2024 |
ruralindiaonline.org | M. Kumar |Y. Krishna Jyothi
మావాళ్ళ మరణాల గురించి రాయడానికి నేనుప్రయత్నించిన ప్రతిసారీ, శరీరం నుండి శ్వాస వదిలి వెళ్ళిపోయినట్లుగా నా మనసంతా ఒక్కసారిగాఖాళీ అవుతుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ, మన సమాజం మాత్రంతమ శరీరాన్ని ఉపయోగించి పనిచేసే పారిశుద్ధ్య శ్రామికుల జీవితాలను అసలు పట్టించుకోదు. వీరి మరణాలు సంభవిస్తున్నాయని కూడా ప్రభుత్వం ఒప్పుకోదు.
-
Nov 30, 2024 |
ruralindiaonline.org | Prakash Bhuyan |Swadesha Sharma |Y. Krishna Jyothi
సుశిక్షితమైన దీపికాకమాన్ కళ్ళు, దాదాపు ఒకేలా కనిపించే మగ-ఆడ పట్టు పురుగుల మధ్యనున్న తేడాను ఇట్టే పసిగట్టగలవు. “ఆ రెండూ ఒకేలా కనిపిస్తాయి కానీ, మగ పురుగు ఆడ పురుగు కంటే పొడవుగా ఉంటుంది,” దాదాపు13 సెంటీమీటర్ల పొడవైన రెక్కలున్న గోధుమ-లేత గోధుమరంగు జీవులను చూపిస్తూ ఆమె వివరించింది. “పొట్టిగా, స్థూలంగా ఉన్నది ఆడ పురుగు.” అస్సామ్‌లోని మాజులీజిల్లా, బొరుణ్ సితదర్ సుక్ గ్రామానికి చెందిన దీపిక, మూడేళ్ళ క్రితం ఎరి పట్టుపురుగుల ( సమియా రిసినీ ) పెంపకాన్ని మొదలుపెట్టారు.
-
Nov 25, 2024 |
ruralindiaonline.org | Arshdeep Arshi |Priti David |Y. Krishna Jyothi
“ నర్క్ హై యే (ఇది నరకం).” తన గ్రామం వెంబడి,పారిశ్రామిక వ్యర్ధాలతో కలుషితమై ప్రవహిస్తున్న బుడ్డా నాలా గురించి కశ్మీరా బాయి వివరిస్తున్నారు. ఆమె ఇంటికి కేవలం వంద మీటర్లదూరంలో ఉన్న సత్లజ్ నదిలోకి అది ప్రవహిస్తుంది. ప్రస్తుతం మలినలభైలలో ఉన్న కశ్మీరా బాయి, తాగునీటి అవసరాల కోసం తన గ్రామ ప్రజలు ఒకప్పుడు ఆధారపడినస్వచ్ఛమైన నదిని గుర్తు చేసుకున్నారు.
-
Nov 5, 2024 |
ruralindiaonline.org | Sanskriti Talwar |Naveen Macro |Sarbajaya Bhattacharya |Y. Krishna Jyothi
హరియాణా ప్రభుత్వ యాజమాన్యంలోని రోడ్డు రవాణా శాఖలో గుమాస్తాగా పదవీ విరమణచేసిన తరువాత, భగత్ రామ్ యాదవ్ విశ్రాంత జీవితాన్ని ఎంచుకొని ఉండవచ్చు. “కానీ నాలోఒక జునూన్ (అమితోత్సాహం) కలిగింది,” ఆదర్శవంతుడూ,ఎన్నో పతకాలు సాధించిన ఉద్యోగీ అయిన 73 ఏళ్ళ ఈ వృద్ధుడు అన్నారు. ఈ అమితోత్సాహం ఆయనకు తన చిన్నతనంలో తండ్రి గుగ్గన్ రామ్ యాదవ్ నేర్పించిన చార్‌పాయిలు (నులక మంచాలు), పిడ్డాల (నులక అల్లిన ఎత్తుపీటలు) తయారీ కళనుకొనసాగించేలా చేసింది. అతని ఈ అభ్యాసం అర్ధ శతాబ్దం క్రితం ప్రారంభమైంది.
Try JournoFinder For Free
Search and contact over 1M+ journalist profiles, browse 100M+ articles, and unlock powerful PR tools.
Start Your 7-Day Free Trial →